- జన్నారం ఆసుపత్రుల్లో టీజీఎంసీ, ఐఎంఏ అధికారుల తనిఖీలు
- నకిలీ వైద్యులే టార్గెట్
HOSPITALS EXAMINATION : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో గురు వారం నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ఆదేశాల మేరకు పలు ఆసుపత్రులపై టీజీఎంసీ (TGMC), ఐఎంఏ (IMA) టాస్క్ ఫోర్స్ (TASK FORCE) కమిటీ ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నకిలీ వైద్యులు నడిపిస్తున్న క్లినిక్ (CLINIC) లపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు క్లినిక్ లు అనుమతి లేకుండా వైద్యం అందిస్తున్నట్లు గమనించారు.
జన్నారం మండల కేంద్రంలో టాకిని శ్రీనివాస్ (జన్నారం బొక్కల దవాఖానా), చేటుపల్లి సత్యన్న (మణికంఠ క్లినిక్)లు ఎలాంటి అనుమతి లేకుండా క్లినిక్ లు నిర్వహిస్తూ, అధిక మోతాదులో ఆంటీబయోటిక్స్ (ANTIBIOTIC), నొప్పి మందులు, ఐవీ (IV) ఫ్లూయిడ్స్, ఇతర హై షెడ్యూల్ మందులు ఇస్తున్నట్లు గుర్తించారు.

టీజీఎంసీ (TGMC) ఇతికల్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ టాకీని శ్రీనివాస్ అనుమతి లేకుండా ఎక్స్-రే (X-RAY) లు, ల్యాబ్ టెస్టు (LAB TEST) లు నిర్వహించడంతో పాటు విరిగిన ఎముకలకు అనుభవం లేని చికిత్స చేస్తూ అనారోగ్యాలకు కారణమవుతున్నాడని తెలిపారు. ప్రజలు నకిలీ వైద్యుల బారిన పడవద్దని, ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకోవద్దని, ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందాలని సూచించారు.
ఈ ఆకస్మిక తనిఖీల్లో TGMC కో-ఆప్షన్ మెంబర్ డాక్టర్ సంతోష్, మంచిర్యాల HRDA సభ్యులు డాక్టర్ అనిల్, మంచిర్యాల IMA సెక్రటరీ డాక్టర్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :