Birla School: రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భబిత విశ్వనాథన్, పాఠశాల వ్యాయామ విద్యా విభాగాధిపతి సుంకరి మురళీధర్ గురువారం తెలిపారు. ఇటీవల గోదావరిఖని లో జరిగిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థినీ అనర్విన్య వెంగలదాసు 16 సం,, ల విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9 నుండి 12 వరకు మంచిర్యాల జిల్లా లోనీ రామకృష్ణాపూర్ లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనిర్విన్య రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థి ని ని మరియు పాఠశాల ఫుట్ బాల్ కోచ్ లు అనుష్ మరియు సాయికిరణ్ ను ఛైర్మెన్ దాసరి ప్రశాంత్ రెడ్డి , ఉపాధ్యాయుల బృందం అభినందించారు.
శెనార్తి మీడియా, కరీంనగర్