posters
పోస్టర్ లను ఆవిష్కరిస్తున్న డీసీపీ, ఏసీపీ, ఇతర అధికారులు

POLICE HEALTH CAMP : ఆరోగ్యంగా జీవితాన్ని గడపాలి

  • మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్

POLICE HEALTH CAMP : ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని, ఉద్యోగంతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. టచ్ హస్పిటల్ ఆధ్వర్యంలో పోలీసులకు కార్డియాలజీ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని శనివారం పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పోలీస్ ఉద్యోగమే ఛాలింజింగ్ తో కూడుకున్నదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి ఉద్యోగంలో మానసిక, శారీరక ఒత్తిడిలు ఉంటాయని, పోలీస్ ఉద్యోగం కూడా అలాంటిదేనన్నారు. అలవాట్లను, ఆలోచన పద్దతులను మార్చుకొని, ఆర్థిక స్తోమతకు తగినట్టు, పిల్లల్ని, కుటుంబ సభ్యులను కాపాడుకుంటు జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు. ప్రతి రోజు 20 మందికి హార్ట్ కి సంబంధించి వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ భుర్కండే గుండె సంభందిత వ్యాధులపై పోలీసులకి అవగాహన కల్పించారు. అనంతరం శిబిరానికి సంబంధించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మంచిర్యాల టౌన్ సిఐ ప్రమోద్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వరరావు, టచ్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ తిరుమల్ రావు, డాక్టర్ వికాస్, డాక్టర్ సుమన్, సిఇఓ రాజ్ పాల్, మేనేజింగ్ డైరెక్టర్ మాటేటి శ్రీనివాస్, డైరెక్టర్లు శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, జనాకర్ రెడ్డి సుభాష్‌ రెడ్డి, పోలీసులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *