- కేశవపట్నంలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నాయకులు
BRS Andolana: తెలంగాణలో సన్న వడ్లు పండించిన రైతులకు తక్షణమే బోనస్ ప్రకటించాలని, పంటల సాగుకు ఎరువుల కొరత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి, వారికి తగిన న్యాయం చేయకపోతే తీవ్ర ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
భీఆర్ఎస్ శంకరపట్నం మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో కేశవపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా మెయిన్ రోడ్డుపై పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఎన్నడూ ఎరువుల కొరత రాకుండా ముందు చూపుతో వ్యవహరించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎరువుల కోసం చెప్పులు, పాస్ బుక్కులు క్యూలో పెట్టాల్సిన దుస్థితి దాపురించింందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు
మొత్తం మీద, సన్న వడ్ల పంట రైతుల సమస్యను కేంద్రంగా చేసుకుని బీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, శంకరపట్నం
