CEIR: కరీంనగర్ రూరల్ పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను కనుగొని, బాధితుడికి తిరిగి అందజేసి సేవా పట్ల నిబద్ధతను చూపించారు. సప్తగిరి కాలనీకి చెందిన అబ్దుల్ రెహమాన్ తన మోటో ఎడ్జ్ ఫోన్‌ను 2024 సెప్టెంబర్ 2న నగునూరులో పోగొట్టుకున్నాడు. వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) టెక్నాలజీ ద్వారా ఫోన్ స్థానాన్ని గుర్తించారు. కశ్మీర్‌గడ్డలో ఫోన్ ఉన్నట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు.
గురువారం, రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి మోటో ఎడ్జ్ ఫోన్‌ను అబ్దుల్ రెహ్మాన్‌కు తిరిగి అప్పగించారు. తన ఫోన్ తిరిగి లభించినందుకు అబ్దుల్ రెహ్మాన్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ విశ్వతేజను సీఐ నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్