Promotions in Police Department
Promotions in Police Department

Promotions in Police Department: హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా ప్రమోషన్

రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Promotions in Police Department: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి ఎఎస్ఐలుగా ప్రమోషన్ పొందారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కార్యాలయంలో ఉద్యోగోన్నతి పొందిన అధికారులను అభినందించి, ర్యాంక్ చిహ్నాలను అలంకరించారు.

ఈ సందర్భంగా కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ పోలీస్ శాఖలో ప్రమోషన్లతో బాధ్యతలు కూడా పెరుగుతాయన్నారు. వాటిని క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. భవిష్యత్తులో ఉత్తమ సేవలందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింతగా పెంచాలని సూచించారు.

శెనార్తి మీడియా, గోదావరిఖని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *