Library: పాఠశాలల్లో విద్యార్థులు సంపూర్ణ మానవీయ మూర్తిమత్వాన్ని పొందాలంటే అన్ని నైపుణ్యాలు సాధించాల్సిన అవసరం ఉందని, ఇందుకు గ్రంథాలయాలు ప్రధాన సాధనమని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. గ్రంథాలయ పిరియడ్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పాఠశాలల్లో గ్రంథాలయాల నిర్వహణ సక్రమంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవల విడుదలైన జాతీయ సామర్థ్య పరీక్ష-2024 ఫలితాల్లో మూడో తరగతిలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో మొదటి స్థాయిలో నిలవగలిగిందని తెలిపారు. ఈ ఫలితాల సాధనలో కృషి చేసిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థుల అభ్యసన ఫలితాల సాధనలో రానున్న రోజుల్లోనూ ఇదే ఉత్తేజంతో ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, రిసోర్స్ పర్సన్లు బుచ్చన్న, రమేష్ తోపాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
