Nadipall Divakar Rao
Nadipall Divakar Rao : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నడిపెల్లి దిావాకర్ రావు

Nadipalli: అవినీతికి కేరాఫ్ అడ్రస్ పీఎస్సార్

మంచిర్యాల ఎమ్మెల్యేపై నడిపెల్లి సంచలన వ్యాఖ్యలు
ఇండియాలో జీఎస్టీ.. మంచిర్యాలలో పీఎస్టీ(ప్రేమ్ సాగర్ రావు టాక్స్)
వసూళ్లే లక్ష్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే వైఖరి
బెదిరింపులు.. భూకబ్జాలు.. రౌడీయిజం
ప్రేమ్ సాగర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన దివాకర్ రావు

Nadipalli: మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Nadipally Divakar Rao) ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఎస్సార్ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి దివాకర్ రావు విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ నిలుస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనలో మంచిర్యాల వసూళ్ల రాజధానిగా మారిపోయిందని ఆరోపించారు. ప్రేమ్ సాగర్ అవినీతి రాజ్యానికి రాజుగా మారాడని విమర్శించారు.

మంచిర్యాలలో పీఎస్టీ..(ప్రేమ్ సాగర్ రావు టాక్స్)

మంచిర్యాలలో కొత్తగా పీఎస్టీ వచ్చిందన్నారు. ఇండియాలో జీఎస్టీ ఉంటే.. మంచిర్యాలలో పీఎస్టీ (PST)ఉందన్నారు. పీఎస్టీ అంటే ప్రేమ్ సాగర్ రావు టాక్స్ (Pream Sagar Rao Tax) అని అభివర్ణించారు. పేదోడి ఇంటికైనా, వ్యాపారుల దుకాణాలకైనా, చివరకు శ్మశాన వాటికనూ కూడా వసూళ్లలో వదిలిపెట్టలేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో వసూళ్లకు కొత్త పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు.

అడుగడుగునా వసూళ్లు.. ఆపేదెవరూ..?

మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి నిర్మాణం వెనుక ప్రేమ్ సాగర్ గ్యాంగ్ కమీషన్ ఉందని ఆరోపించారు. ఉమర్ మియా సొసైటీకి చెందిన ప్రతీ ఇంటిపై లక్షల్లో వసూలు చేశారన్నారు .కలెక్టర్ ఆఫీస్ వద్ద కూల్చేసిన ఇండ్లను మళ్లీ కడుతుంటే కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేయడం పీఎస్సార్ అనుచరుల పని అని అన్నారు. మంచిర్యాల వ్యాపారుల నుంచి కోట్లలో వసూలు చేశారని ఆరోపించారు. ఓ బిల్డింగ్ కూలగొట్టకుండా ఉండేందుకు ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు.

ఎఫ్ టీఎల్ పేరిట వసూళ్లు..

నూతన వెంచర్ల ఏర్పాటు పేరుతో లక్షెట్టిపేట, హాజీపూర్ ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని దివాకర్ ఆరోపణలు గుప్పించారు. ఇటిక్యాల చెరువులో ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధి పేరుతో ప్రజలను మోసం చేస్తూ రెండు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఎఫ్టీఎల్ పేరిట డబ్బులు చెల్లిస్తే మీ భూమి సేఫ్ గా ఉంటుందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ప్రభుత్వ భూమి మీద ఎవరూ కబ్జా చేసుకోలేరన్నారు.

బెదిరింపులు, కబ్జాలు, రౌడీయిజం ఇదే పీఎస్సార్ పాలన

ప్రేమ్ సాగర్ రావు(Pream Sagar Rao) ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మంచిర్యాలలో పాలన పూర్తిగా గ్యాంగ్ కల్చర్‌కు లోనైందని ఆరోపించారు. గంజాయి గ్యాంగ్‌లు తయారుచేసి, వారితో ప్రజలను బెదిరించడం, వ్యాపారులను లొంగదీసుకొని డబ్బులు దోచుకోవడం రోజువారీ దౌర్జన్యంగా మారిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ్ సాగర్ రావు పాలన అంటే భూములపై దాడులు, కబ్జాలు, లంచాలు, అక్రమ నిర్మాణాలేనని అన్నారు. ప్రజాపాలనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

శ్మశాన వాటికకూ వసూళ్లు

ప్రేమ్ సాగర్ అవినీతి చరిత్రలో శ్మశాన వాటికను సైతం వదల్లేదని ఆరోపించారు. శవాలను కూడా విడిచిపెట్టడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. చచ్చినా శాంతి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక నిర్వహణ పేరుతో మార్వాడి సమాజం, వైశ్య సంఘాల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అక్రమ కట్టడాలు కూల్చుతాం..
ప్రస్తుతం ప్రేమ్ సాగర్ అనుచరులు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు, కబ్జా చేసిన భూములను వదిలేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే, ఆ అక్రమాలన్నింటిని తుడిచిపెట్టేసి, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *