Police Sports Meet: కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ స్థాయి క్రీడా పోటీలను రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. క్రీడల్లో గెలుపోటములు ముఖ్యం కాదని, ఆటల్లో ఎంత ప్రతిభ చూపారనేదే ముఖ్యమని చెప్పారు. క్రీడల ద్వారా మీ శారీరక ధారుడ్యం పెరగడంతో పాటు, పనిఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఇక్కడ ప్రతిభ చూపిన కాళేశ్వరం జోన్ తరపున రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని, అక్కడ కూడా కాళేశ్వరం జోన్ కు అత్యధిక పతకాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, ములుగు ఆర్ఐ సంతోష్, పీజికల్ డైరెక్టర్స్ శ్రీనివాస్, విజయ్ కుమార్, జోన్ పరిధిలోని లాంగ్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరిఖని