మంచిర్యాల అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్
Ration Cards: జిల్లాలో కొత్త ఆహార భద్రత కార్డులు మంజూరు, కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత రెండు నెలల్లో మంజూరు చేసిన 4,797 కొత్త రేషన్ కార్డులు అర్హులైన వారికి అందించామని పేర్కొన్నారు .
రేషన్ కార్డుల మ్యుటేషన్ల కోసం అందిన 35,178 దరఖాస్తులను పరిశీలించి ఆమోదముద్ర వేశారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వివరించారు. ప్రజలు ఆందోళన చెందవదని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హులకు కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
