- జై బాపు.. జై భీమ్ అంటూ నినదించిన హస్తం కార్యకర్తలు
Congress: కాంగ్రెస్ పార్టీ గన్నేరువరం మండల అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పారువెల్ల, ఖాసింపేట్, చాకలివానిపల్లి గ్రామాల్లో బుధవారం
జై బాపు జై భీమ్ – జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. జై బాపు.. జై భీమ్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినదించారు.
రాజ్యాంగాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. పాదయాత్రలో మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జెల్లా రాజేశ్వరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎఎంసీ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మహిళా సెల్, యూత్ కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, గన్నేరు వరం