కేటీఆర్ ప్రెస్ మీట్ కేవలం ట్రైలర్ మాత్రమే..
తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్ వివేకానంద నంద ప్రెస్ మీట్
ఈ కుంభకోణంలో ఓ బీజేపీ ఎంపీ ఉన్నాడని ఆరోణలు
BRS Press Meet: కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారంలో పదివేల కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా నిరూపించాడని బీఆర్‌ఎస్ అసెంబ్లీ విప్ వివేకానంద తెలిపారు. కేటీఆర్ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయారని ఎద్దేవా చేశారు.
ఈ వ్యవహారంలో ప్రభుత్వం పీకల లోతు ఇరుక్కుపోయిందన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, ఆయన డమ్మీ అధ్యక్షుడిగా మారిపోయారని విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌ను జైలుకు పంపిస్తామన్న మాటలతో బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్న మహేష్ గౌడ్ ఉడత ఊపులకు భయపడేది ఎవ్వరూ లేరన్నారు.
చర్చకు రమ్మన్న మహేష్ గౌడ్‌కి స్పందనగా వస్తామని తెలిపారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ విచారణాధికారుల్లా వ్యవహరిస్తున్నారని, చట్టాన్ని తమ కోసం వంకరగా మార్చుకున్నారని ఆరోపించారు. కేటీఆర్‌పై విచారణ జరిపించాలని అనేక సంస్థలకు లేఖలు పంపామని, ఇతరులు కూడా లేఖలు రాసి విచారణ కోరాలని సూచించారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సిబిఐ విచారణలు కోరిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టమని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
రైతు భరోసా పేరుతో తెచ్చిన అప్పు మొత్తాన్ని కాంట్రాక్టర్ల జేబుల్లో వేసారని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికీ డబ్బులు పడలేదని, కారణం చెప్పాలన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పెట్టిన డిమాండ్లపై ప్రభుత్వం చర్చించకుండా పారిపోయిందన్నారు.
మీనాక్షి నటరాజన్ సూపర్ సీఎం లా వ్యవహరిస్తున్నారని, రేవంత్ తప్పులను సమర్థిస్తున్నారా లేక సరి చేస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను కాపాడితే, రేవంత్ దానిపై అన్యాక్రమణ చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన 17 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ దందాలకు ఉపయోగిస్తున్నారని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ భూ దందా చేస్తే, ఇప్పుడు సీఎంగా అధికారికంగా అదే చేస్తూ ఉన్నారన్నారు. బ్రోకర్‌కి 170 కోట్లు ఎలా చెల్లించారో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో భూములను పదివేల కోట్లకు తాకట్టు పెట్టామన్న ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గుతోందని విమర్శించారు.
ఐసీఐసీఐ బ్యాంక్ పదివేల కోట్లు ఇచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చినప్పుడు ఖండించని బ్యాంక్ ఇప్పుడు ఎందుకు ఖండించుతోందని ప్రశ్నించారు. ఒక్కసారికి 75 కోట్లు ఎకరా అంటారు, మరోసారి 52 వేలు ఎకరా అంటారు. ఇలాంటి రకరకాల వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
ఈ అంశంపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ కేవలం ట్రైలర్ మాత్రమేనని… ఇంకా ఎన్నో విషయాలు బయట పడతాయని కేపీ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఓ బీజేపీ ఎంపీ పేరు సైతం త్వరలో బయట పెడతామని వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ సంకీర్ణ పాలన కొనసాగుతోందన్నారు. బీఆర్‌ఎస్‌పై పగతోనే, భూములపై పాగా సిద్ధాంతంతో రేవంత్ పాలన సాగుతోందని ఆరోపించారు. మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రెస్‌మీట్‌లో మన్నె గోవర్ధన్ రెడ్డి, కే కిషోర్ గౌడ్, తుంగబాలు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, హైదరాబాద్