- ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం
- ఆదిలాబాద్ జిల్లా ఉండం గ్రామ శివారులో ఘటన
Sucide Atttempt : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని ఉండం గ్రామ శివారు ప్రాంతంలోని వ్యవసాయ పొలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరు అక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన ఆకుల రాకేష్(34) ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఫర్టిలైజర్ షాపు నడుపుతున్నాడు. హస్నాపూర్ గ్రామానికి చెందిన రాకేందర్ అనే వ్యక్తి రూ.60 లక్షలు రాకేష్ అప్పుగా ఇచ్చాడు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని పలు మార్లు రాకేష్ రాకేందరు అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాకేష్, భార్య లావణ్య(28), మేన మరదలు స్పందన (19), కూతురు ప్రశంస(8)తో కలిసి కప్పర్ల గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై ఉండం శివారు ప్రాంతంలోని రాకేష్ పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
రాకేష్ మేన మామ స్వామి, అత్తమ్మ మృతి చెందడంతో వారి కూతురు స్పందన రాకేష్ ఇంట్లోనే ఉంటుంది. స్పందన, రాకేష్, లావణ్య, ప్రశంస నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి పొలానికి వెళ్లగా ముగ్గురు పురుగుల మందు తాగారు. అనంతరం రాకేష్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం అందించడంతో కుటుంబీకులు, గ్రామస్తులు అక్కడికి చేరుకొని రిమ్స్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించగా అప్పటికే రాకేష్, స్పందన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లావణ్య రిమ్స్ లో చికిత్స పొందుతుంది. రిమ్స్ లో మృతదేహాలను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించి ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ ఫణిందర్, తలమడుగు, తాంసి ఎస్సైలు అంజమ్మ, రాధిక విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజమ్మ తెలిపారు.
-శెనార్తి మీడియా, తలమడుగు
