- హంటర్ రోడ్డులో అక్రమ నిర్మాణం కూల్చివేత
Hydra Effect:హైదరాబాద్ లో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు క్రమక్రమంగా జిల్లాలకు పాకుతున్నాయి. తాజాగా హన్మకొండలోని ఓ అక్రమ నిర్మాణాన్ని జీడబ్ల్యూఎంసీ అధికారులు కూల్చివేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
హనుమకొండ హంటర్ రోడ్ మెడికవర్ హాస్పిటల్ వద్ద ఉన్న శాయంపేట పరిధి సర్వే నంబర్ 125/క్ లో మంద జ్యోతి, మంద కృష్ణ, మంద ఇద్దయ్య అక్రమంగా నిర్మాణం చేపట్టారని నంబూరి చారుమతి జీడబ్ల్యూఎంసీకి ఇచ్చిన నివేదికను డెప్యూటీ కమిషనర్ పరిశీలించారు. ఈ నిర్మాణాన్ని తొలగించాలని 2022 నవంబర్26 నోటీసులు ఇచ్చారు. రెండేళ్లయినా తొలగించినా అమలు చేయక పలుమార్లు నోటీసులు పంపించారు. నిర్మాణాలను తొలగించకపోవడంతో నంబూరి చారుమతి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
జీడబ్ల్యూఎంసీ తాము ఇచ్చిన నోటీసులు, ఆదేశాలను వెంటనే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మునిసిపల్ కమిషనర్ అశ్విని తానాజి కి మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ కూల్చివేత ఆదేశాలను రద్దు చేయాలని మంద కృష్ణ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం జీడబ్ల్యూసీ
ఆదేశాలను వెంటనే అమలు చేయాలని తేల్చి చెప్పింది. జీడబ్ల్యూఎంసీ అధికారుల సమక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.
