Financial Help:సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన నెంటూర్ కనకయ్య (42) అనారోగ్యంతో గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ గ్రామ శాఖ సభ్యులు మృతుడి కుటుంబాన్ని శుక్రవాం పరామర్శించి రూ.10వేలు పార్టీ గ్రామ శాఖ తరఫున అందజేశారు. ఇక్కడ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేశ్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ గుర్రాల నర్సింలు, సీనియర్ నేతలు గుర్రాల శ్రీను, భాస్కర్, చంద్రయ్య, కనకయ్య, కరుణాకర్, శివారెడ్డి నర్సింలు, శ్రీను, బలరాం, నవీన్, స్వామి తదితరులు ఉన్నారు.
-శెనార్తి మీడియా, మర్కుక్: