- అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహనాల చెకింగ్
NARCOTIC DOG : తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు మంచిర్యాల జిల్లా కోటపల్లి (KOTAPALLI) మండలం రాపనపల్లి (RAPANPALLI) చెక్ పోస్టు వద్ద గురు వారం రాత్రి 10 గంటల తర్వాత పోలీసులు నార్కొటిక్ (NARCOTIC) జాగిలంతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలతో పాటు, చెన్నూర్ వైపు వచ్చే వాహనాలన్నింటిని చెక్ చేశారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు (INTER STATE CHECT POST) వద్ద ఒక్క సారిగా వాహనాల తనిఖీలు చేపట్టడం, జాగిలం (DOG) తో వాహనాలను పరిశీలించడం, వారి వస్తు సామాగ్రిని సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు.

గంజాయి రవాణాను అరికట్టడమే లక్ష్యంగా…
మంచిర్యాల డీసీపీ (DCP) ఎగ్గడి భాస్కర్ ఉత్తర్వులు మేరకు జిల్లాలో గంజాయిని అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టామని జైపూర్ ఏసీపీ (ACP) వెంకటేశ్వర్లు తెలిపారు. సమీప రాష్ట్రాల నుంచి గాంజా వస్తుందనే సమాచారంతో అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద నార్కొటిక్ జాగిలం (DOG)తో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి రహిత ప్రాంతంగా మార్చడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీలు, పెట్రోలింగ్ ను ముమ్మరం చేశామన్నారు.
గంజాయి మీద ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ నార్కొటిక్ జాగిలంతో సైతం తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలలో చెన్నూరు రూరల్ ఇన్ స్పెక్టర్ (CI) సుధాకర్, కోటపల్లి ఎస్ ఐ (SI) రాజేందర్, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, టీ ఎస్ ఎస్ పీ (tssp) సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :