పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
BRS Sabha : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన సింగరేణి కార్మికులు, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. శనివారం ఆర్జీ-1పరిధిలోని 11ఏ గనిలో కార్మికులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ, తొలిసారిగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా నియమితులైన కేసీఆర్ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. కారుణ్య నియామకాల ద్వారా వారసులకు ఉద్యోగాలు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ కు కార్మికులు మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసు రామమూర్తి, నూనె కొమురయ్య, వడ్డెపల్లి శంకర్, పర్లపల్లి రవి, బీఆర్ఎస్ నేతలు కౌశిక హరి, గోపు అయిలయ్య యాదవ్, నారాయణదాసు, మారుతి జోసెఫ్, ఆవునూరి వెంకటేష్, రామరాజు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గోదావరిఖని
