TGSWR
TGSWR : టేబుల్ టెన్నీస్ ఆడుతున్న అలుగు వర్షిణి

TGSWR : రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌ను సందర్శించిన గురుకుల కార్యదర్శి

TGSWR : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్‌ను ఈ నెల 25న టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ కార్యదర్శి అలగు వర్షిణి సందర్శించారు. రాత్రి అక్కడే బస చేశారు. స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం ఉదయం 5:30 గంటల నుంచి ప్రారంభమైన డ్రిల్, ట్రెక్కింగ్, ఫిజికల్ ట్రైనింగ్ లాంటి శారీరక వ్యాయామాల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థుల్లో ఉత్సాహం నింపారు. బాక్సింగ్ బౌట్లలో కూడా పాల్గొన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. క్యాడెట్లతో ప్రత్యక్షంగా మాట్లాడి, రాబోయే ఎన్డీఏ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. జేఈఈ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం పూణేలో శిక్షణ పొందుతున్న కేడెట్ రామడుగు సిద్ధార్థను ప్రత్యేకంగా అభినందించారు.

అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో 22మంది క్యాడెట్లు ఉచిత సీట్లు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 169 మందిలో అత్యధికంగా రుక్మాపూర్‌కు సీట్లు రావడం గర్వకారణమని పేర్కొన్నారు.  పాఠశాల అభివృద్ధిపై దృష్టి సారించిన కార్యదర్శి, మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రుక్మాపూర్ స్కూల్‌ను రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన సైనిక్ స్కూలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు అంగీకారం తెలిపారు.

TGSWR
TGSWR : మాట్లాడుతున్న వర్షిణి

ఈ సందర్భంగా తల్లిదండ్రులతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. విద్యార్థుల విజయానికి సమర్థవంతమైన మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎన్డీఏలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు ప్రత్యామ్నాయ అవకాశాలను సూచిస్తూ, పారా మిలిటరీ ఫోర్సులు, సివిల్ సర్వీసులు, బ్యాంకింగ్, ఐటీ, ఇంజినీరింగ్ రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • సీబీఎస్ఈ సిలబస్‌తో పాటు యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ సిలబస్ బోధనకు గౌరవ వేతన బోధన సిబ్బంది నియామకం.
  • ప్రతి తరగతి విద్యార్థులకు వారంలో ఒకరోజు కరీంనగర్ స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ శిక్షణ.
  • ఆర్చరీ, బాక్సింగ్ శిక్షణలో మెరుగుదలకు ఆధునిక సామగ్రి అందజేత.
  • కంప్యూటర్ సైన్స్ బోధనకు ఐటీ టీచర్ నియామకం.

సెక్రటరీ అలగు వర్షిణి వెంట జోనల్ అధికారి ఎం. భీమయ్య, హెడ్ ఆఫీస్ సిబ్బంది శర్మ, కిశోర్, పాఠశాల డైరెక్టర్ కర్నల్ కేసీ రావు, ప్రిన్సిపాల్ జీ కాళహస్తి, ఆర్మీ సిబ్బంది, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

-శెనార్తి మీడియా, కరీంనగర్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *