Malabar Gold : ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, అతిపెద్ద బంగారు నగల రిటైల్ వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్& డైమండ్స్ తమ “బ్రైడల్ జ్యువెలరీ షో”ని మంచిర్యాల షోరూంలో గురువారం ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సింగరేణి మందమర్రి జీఎం సతీమణి స్వరూప హాజరయ్యారు. స్టోర్ డైరెక్టర్లు రోషన్ లాల్, బొబాటో టామీ, మేనేజర్లు కిరణ్, ఫెరోజ్ ఖాన్, మార్కెటింగ్ ఇన్చార్జి క్రాంతి పాల్గొన్నారు.
ఈ “బ్రైడల్ జ్యువెలరీ షో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 10 వరకు కొనసాగనుంది. భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నవ వధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ఈ షోలో ప్రదర్శించనున్నారు.
భారత దేశంలో వివాహం గొప్ప వేడుక. ఎన్నో కుటుంబాలు, బంధువులు, ఆత్మీయుల రాక, తమ ఆచార వ్యవహారాలతో ఒకరినొకరు గౌరవించుకోవడం, ఆలింగనాలు పలకరింపులతో కూడిన ఉద్విగ్న క్షణాలు.. ఎటు చూసినా సందడిగా కనిపించే అత్యంత గొప్ప వేడుక. ఈ అసాధారణ పరిస్థితిని సైతం సానుకూల మార్గంలో ముందుకు తీసుకెళ్తూ, నేటి వధువు కోసం మలబార్ గోల్డ్ & డైమండ్స్ సరికొత్త ధోరణిని నెలకొల్పింది. #Show the way సందేశంతో మలబార్ సంస్థ ముందుకు వచ్చింది. కొత్త పెళ్లికూతురి అందచందాల నుంచి పొందిన ప్రేరణతో విస్మయపరిచే ఆభరణాల సేకరణలను ఈ ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తున్నది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇతర బ్రాండ్లు అయిన భారతీయ వారసత్వ ఆభరణాలు, హస్తకళారూపాల ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల బ్రాండ్ ‘మైన్’, అన్ కట్ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ మొదలైనవి కూడా ఈ ప్రచారంలో చోటుచేసుకున్నాయి.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత దేశ వ్యాప్తంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూములలో ఒకే ఉత్తమమైన ధర వినియోగదారులకి అందిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వినియోగదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుంది. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు, ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టిక, ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100 శాతం విలువ, వజ్రాభరణాల పై 100% విలువ లభిస్తుంది. బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, నూరు శాతం బీఐఎస్ హాల్ మార్కుతో ధ్రువీకరించబడిన స్వచ్ఛమైన బంగారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28-పాయింట్ల నాణ్యత పరీక్షలు నిర్వహించిన ఐజీఐ, జీఐఏ ధృవీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్ ఎనలైజర్, జీవితకాల నిర్వహణ, బాధ్యతాయుతమైన మూలాల నుంచి బంగారం సేకరణ వంటి వాగ్ధానాలను అందిస్తుంది.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గురించి:
విభిన్న వ్యాపార సమ్మేళనాలతో స్థాపించిన ప్రముఖ భారతీయ వ్యాపార సంస్థ మలబార్ గ్రూపు ఫ్లాగ్షిప్ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 1993 లో ఏర్పాటైంది. 375కి పైగా షోరూములు, 14 హోల్‌సేల్ యూనిట్లు, కార్యాలయాలు, డిజైన్ కేంద్రాలు, ఫ్యాక్టరీలతో భారతదేశం, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, యూఎస్ఏ, మిడిల్ ఈస్ట్ , ఫార్ ఈస్ట్ వంటి 13 దేశాల్లో బలమైన రిటైల్ నెట్‌వర్క్ కలిగి ఉన్నది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్లలో 6వ స్థానంలో నిలిచింది. డెలాయిట్ గ్లోబల్ పవర్స్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ 2023 ర్యాంకింగ్‌లో 19వ స్థానం కైవసం చేసుకుంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల