sri rama navami pranav pattu vasthtralu
sri rama navami pranav pattu vasthtralu : పట్టు వస్త్రాలు తీసకువస్తున్న వొడితల ప్రణవ్

Kalyanotsavam: ఇల్లందకుంట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ప్రణవ్

  •  పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన కాంగ్రెస్ నేత ప్రణవ్
  •  జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన రెండో భద్రాద్రి
  • అన్నదాన కార్యక్రమ నిర్వాహకులను అభినందించిన ప్రణవ్.
  • కల్యాణానికి వచ్చిన భక్తులకు మంత్రి పొన్నం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

Kalyanotsavam: అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని,కళ్యాణ మండపంలో పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తుల రామనామస్మరణల మధ్య అభిజిత్ లగ్నంలో సీతమ్మ వారి మెడలో రామయ్య తాలిబొట్టు కట్టారు. హుజురాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో,అష్టైశ్వర్యాలు చేకూరాలని భగవంతున్ని కోరుకున్నట్లు తెలిపారు.  ఇల్లందకుంట ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ఆలయ కమిటీతో చర్చించి తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ,నిధులు కేటాయిస్తామని తెలిపారు.

sri rama navami pranav
sri rama navami pranav: స్వామి వారిని దర్శించుకుంటున్న వొడితల ప్రణవ్

భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ..

కళ్యాణానికి వచ్చే భక్తులకు రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రణవ్.వేసవి దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

sri rama navami annadanam pranav
sri rama navami annadanam pranav: భక్తులకు అన్నం వడ్డిస్తున్న వొడితల ప్రణవ్

అన్నదాన కార్యక్రమం గొప్ప కార్యక్రమం

కళ్యాణానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానం చేయడం పట్ల జమ్మికుంట రైస్ మిల్లర్ల,కాటన్ ఇండస్ట్రీస్,పారబాయిల్డ్ రైస్ మిల్లర్లను ఇతర దాతలను అభినందించారు ప్రణవ్.ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని కోరారు.అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వయంగా భక్తులకు వడ్డించారు.

బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లో
శ్రీరామనవమి సందర్భంగా బెజ్జంకి, గన్నేరువరం మండలాల్లోని బెజ్జంకి, గాగిల్లాపూర్, చిల్లాపూర్, లక్ష్మీపూర్ తో పాటు పలు గ్రామాల్లోన సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆయా గ్రామాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకుఅన్నదానం చేశారు.

-శెనార్తి మీడియా, జమ్మికుంట/గన్నేరువరం/బెజ్జంకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *