- కేశవపట్నం ఎస్ఐ కే శేఖర్ రెడ్డి
Lok Adalath: సెప్టెంబర్ 13న జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుందని, ఈ అవకాశాన్ని ఫిర్యాదిదారులు, ముద్దాయిలు వినియోగించుకోవాలని కేశవపట్నంఎస్ఐ శేఖర్ రెడ్డి కోరారు. చట్ట సమ్మతమైన రీతిలో వివాదాలు పరిష్కరించడమే లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు. రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాలు ఆలోచించి పరిష్కరించుకోవాలని సూచించారు. చిన్న చిన్న వివాదాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.
ఒకే కుటుంబానికి చెందిన వారు, ఒకే గ్రామం పట్టణంలో ఉండే వారు కలిసిమెలిసి ఉండాలని, రాజీ మార్గం రాజమార్గమని ఎస్ఐ స్పష్టం చేశారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం
