Alphores Smart school
Alphores Smart school

Alphores Smart: అల్ఫోర్స్ అడ్డదారి.. ఆధారలివిగో..!

  • అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ పేరిట దరఖాస్తు
  • మున్సిపల్, పోలీస్, ఇతర శాఖల ఎన్ఓసీ లేకపోవడంతో తిరస్కరణ..
    అయినా పాఠశాల నిర్వహణ
  • కాంగ్రెస్ గ్రాడ్యుయేట్స్ఎమ్మెల్సీ అభ్యర్థి, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నిర్వాకం
  • అధికార పార్టీ మద్దతు ఉంటే ఏదైనా చెల్లుబాటు అవుతుందనే ధీమానా?
  • విద్యా దానమా? ధనదాహమా?
  • ‘శెనార్తి మీడియా’ కథనాలతో మంచిర్యాల జిల్లాలో జోరుగా చర్చలు

Alphores Smart: అల్ఫోర్స్ విద్యాసంస్థల ఏసీ క్యాంపస్ లు, ర్యాంకుల ప్రకటనలు చూస్తున్న విద్యార్థుల తల్లిండ్రులకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతున్నాయి. టర్మ్ ఫీజు చెల్లించకుంటే అల్ఫోర్స్ విద్యా సంస్థ ఎలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుందో విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను ‘శెనార్తి మీడియా’కు పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. అడ్మిషన్లు ఇచ్చే సమయంలో పరీక్షలు పెట్టి మరీ చేర్చుకుంటున్నారని, ఆ మార్కుల ఆధారంగానే తమ పిల్లలకు ఇయర్ ఫీజు ఇంత అని ముందే నిర్ణయిస్తున్నారని పేర్కొంటున్నారు. వారు పెట్టె టెస్టులో తమ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటేనే అడ్మిషన్ ఇస్తున్నారని, ఇందుకు వేలకు వేలకు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. డబ్బులు మావి అని.. ర్యాంకులు మాత్రం ఇదేదో తమ ఘనత అని చెప్పుకుంటూ వారి పేరిట వేయించుకుంటున్నారని ఓ విద్యార్థి తండ్రి ‘శెనార్తి మీడియా’తో తెలిపారు.

అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మంచిర్యాలలోని హైటెక్ సిటీలో ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు. మరో బ్రాంచ్ ను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ పేరిట పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే ఈ పాఠశాలకు విద్యాశాఖ అనుమతి ఇవ్వలేదనే ఆధారాలను ‘శెనార్తి మీడియా’ సేకరించింది.

అడ్డదారిలో పాఠశాల నిర్వహణ
నర్సరీ నుంచి పదో తరగతి(ఇంగ్లిష్ మీడియం) వరకు అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ నిర్వహణకు గత ఏడాది దరఖాస్తు చేసుకోగా 30 మార్చి2024 విద్యాశాఖ తిరస్కరించింది. తిరస్కరించడానికి గల కారణాలను పొందుపరిచింది.

Alphores Smart school
Alphores Smart school: విద్యాశాఖ తిరస్కరించిన పత్రం

తిరస్కరణకు కారణాలివే..

  • లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్ఓసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు.
  • పోలీస్ శాఖ నుంచి ఎన్ఓసీ పత్రం సబ్మిట్ చేయలేదు.
  • 26 కాలమ్స్ చెక్ లిస్ట్ సరిగా లేదు.
    ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఫొటోలు, సజెషన్ బాక్స్ ఫొటోలు, పర్సనల్ గైడెన్స్, స్కూల్ బిల్డింగ్ వివరాలు సమర్పించలేదు.
  • మరికొన్ని కారణాలను పొందుపరుస్తూ అల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. విద్యాశాఖ తాజాగా ఈ పాఠశాల నిర్వహణకు అనుమతిని నిరాకరిస్తూ Rc. NO. B2/344/2025 పేరిట జనవరి 30న కూడా మరోసారి స్పష్టం చేసింది.

పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారి
పాఠశాలకు అనుమతులు లేని విషయమై సంబంధించి మంచిర్యాల డీఈవో యాదయ్యను ‘శెనార్తి మీడియా’ వివరణ కోరగా అనుమతులు లేని విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. మరి అనుమతి లేకున్నా నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు మాత్రం తీసుకోకపోడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పలుకుబడి ఉంటే చెల్లుబాటు అవుతుందా?
కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తమ విద్యా సంస్థను నిర్వహిస్తున్నామని ప్రకటనలిస్తున్న అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి.. అనుమతి లేకున్నా పాఠశాల నిర్వహించవచ్చా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా పాఠశాల నిర్వహిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమిటనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

అధికార పార్టీలో ఉన్నామనే ధీమానా?
అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను అధికార పార్టీలో ఉన్నందున ఏదైనా చెల్లుబాటు అవుతుందా అని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీ పదవికి పోటీలో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

విద్యాదానమా? ధనదాహమా?
ఇలా అనమతులు లేకుండా పాఠశాల నిర్వహించడంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. విద్యారంగానికి సేవ చేస్తున్నానని, ఎంతో మందిని తీర్చిదిద్దుతున్నామని చెబుతున్న అల్ఫోర్స్ అధినేత వీ నరేందర్ రెడ్డి చెప్పడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యా దానమా? లేక తన ధన దాహం తీర్చుకునేందుకు ఫీజుల రూపేణా లక్షలాది రూపాయలు వసూలు చేయడమా అని ప్రశ్నిస్తున్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *