- బంగారం, వెండి, రూ. 30 వేల నగదు అపహరణ
Molangur Theft: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం మొలంగూర్ గ్రామానికి చెందిన మరాఠీ రాజేశ్వరి మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి వెళ్లింది.
గురువారం మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన రాజేశ్వరి ఇంటి తాళం పగలగొట్టబడి ఉండటం గమనించి దిగ్భ్రాంతికి గురైంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా విరగ్గొట్టి ఇంట్లో వస్తువులు, బట్టలు అస్తవ్యస్తంగా పడివున్నాయి.
బీరువాలో దాచిన అర తులం బంగారం, 50 తులాల వెండి పట్టీలు, సుమారు రూ.30 వేల నగదును దొంగలు అపహరించారని బాధితురాలు విలపిస్తూ తెలిపింది.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలను సేకరిస్తామని పోలీసులు తెలిపారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం:
