Velala Jathara hearth sttoke
Velala Jathara hearth sttoke

Velala Jathara: వేలాల జాతరలో విషాదం

గుండెపోటుతో భక్తుడు మృతి

Velala Jathara: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న జాతరలో విషాదం చోటుచేసుకుంది. నస్పూర్‌కు చెందిన బింగి రాజేందర్ (45) గట్టు మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు గుట్టపైకి ఎక్కుతుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు సమాచారం.

జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే రాజేందర్‌ను కిందికి దించేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనతో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతుండగా, జాతర ప్రాంగణంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొంది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *