- ఇది ధర్మం గెలిచిన రోజు : బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు
“ఇది ధర్మం సాధించిన విజయం” అని బీజేపీ మండల అధ్యక్షులు కొలిపాక రాజు పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పీఠం బీజేపీకి దక్కిన సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల మండల శాఖ హర్షం వ్యక్తం చేసింది. మేయర్ పదవి బీజేపీకి రాకుండా అధికార పార్టీ శతవిధాలుగా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిందని, అయినప్పటికీ ప్రజలు ధర్మం వైపు నిలబడి తీర్పు ఇచ్చారని కొలిపాక రాజు వ్యాఖ్యానించారు.
ఇది సాధారణ కార్యకర్తకు దక్కిన గౌరవమని, రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా జరిగే ప్రతి ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసి బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.
శెనార్తి మీడియా, బెజ్జంకి
