Exam Materials: “సోల్జర్‌కు గన్ను – స్టూడెంట్‌కు పెన్ను” అనే నినాదంతో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో శంకరపట్నం మండలంలోని కొత్త గట్టు, మెట్పల్లి, కేశవపట్నం, తాడికల్, కన్నాపూర్, మొలంగూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు పెన్నులు–ఎగ్జామ్ ప్యాడ్‌లు పంపిణీ చేశారు. శ్రీ సురేష్ ఆత్మారామ్ మహరాజ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ఎదుర్కోవాలి
ప్రము న్యాయవాది, యాదవ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సరస్వతి కటాక్షం కలిగిన పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్‌లు అందజేశారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు. ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, పట్టుదల అవసరమని పేర్కొన్నారు. ఈ సహాయం విద్యాభ్యాసానికి దోహదపడాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గొర్ల అనిల్ యాదవ్, అంతడుపుల శ్రీనివాస్, జుజురి శ్రీనివాస్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

-శెనార్తి మీడియా, శంకరపట్నం:
