ALUMNI REUNION : జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్ శ్రీ రాజరాజేశ్వర ఉన్నత పాఠశాల 1995-96 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (SPIRITUAL COMMUNION) సోమవారం పట్టణంలోని సంగీత కన్వెన్షన్ హాల్ లో ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వారికి విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులతో ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

విద్యార్థులను గొప్పవారుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చూపించిన శ్రద్ధ, నేర్పిన క్రమశిక్షణ అంశాలపై మాట్లాడుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు పూల మాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఈ అపూర్వ సమ్మేళనంలో పాఠశాల కరస్పాండెంట్ తిరుపతిరావు, ఉపాధ్యాయులు మహేష్, ప్రకాష్, శ్రీనివాస్, సీతారాం, రవీందర్, అలీలతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, జగిత్యాల :