jhoncena
jhoncena

Jhoncena: జాన్‌సీనా డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ కోల్పోతున్నాడా?

మరి ఆ టైటిల్ చేజిక్కించుకునేది ఎవరు?

Jhoncena: డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌ను కాపాడుకోవాలనుకుంటున్న జాన్ సీనా(Jhoncena)కు ఇప్పుడు ఓ తీవ్రమైన సవాలు ఎదురవుతున్నది. ఈ సవాలు అందించేది ఎవరో కాదు… రాన్ కిలింగ్స్ అలియాస్ ఆర్-ట్రూత్. డబ్ల్యూడబ్ల్యూఈతో తన ఒప్పందం ముగిసిందని, కొత్తగా కొనసాగడం లేదని ప్రకటించిన ట్రూత్‌… మ‌నీ ఇన్ ద బ్యాంక్ ఈవెంట్‌లో అప్రతిహతంగా రింగ్‌లోకి ప్రవేశించి సీనాపై దాడి చేశాడు. అప్పటి నుంచి అతని దాడులు కొనసాగుతున్నాయి.

స్మాక్‌డౌన్‌లో STFలోకి లాక్కెళ్లిన ట్రూత్
ఇటీవల జరిగిన స్మాక్‌డౌన్‌లో ట్రూత్, సీనాను STF పంజాలో పట్టేశాడు. ప్రస్తుతం సీనా నైట్ ఆఫ్ చాంపియన్స్ ఈవెంట్‌లో సీఎం పంక్‌ తో జరుగబోయే టైటిల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే ట్రూత్ వచ్చే వారం స్మాక్‌డౌన్‌లో సీనాకు టైటిల్‌కు సంబంధంలేని మ్యాచ్‌కి సవాల్ విసిరాడు. వీరిద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో జాన్‌సీనా నుంచి టైటిల్‌‌ను ట్రూత్ దక్కించుకుంటాడా? అన్నదే ఆసక్తికరంగా మారింది.

బిగ్ ఈ వ్యాఖ్యలు
డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ ఛాంపియన్ బిగ్ ఈ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘‘ఇప్పటి ఆర్-ట్రూత్‌ను చూస్తే ఏదైనా సాధ్యమేననిపిస్తోంది. రెండు, మూడు వారాల క్రితం అతను జాన్ సీనాను ఓడిస్తాడని ఎవ్వరైనా చెబితే వాళ్లను నవ్వుకునేవాళ్లం. కానీ ఇప్పుడు మాత్రం అతని ఆట తీరు చూస్తే అసాధ్యం అనిపించడంలేదు’’ అని రా రీక్యాప్ కార్యక్రమంలో బిగ్ ఈ చెప్పాడు.

రాబోయే ఈవెంట్‌పై ఉత్కంఠ
ఇప్పుడు అందరి దృష్టి నైట్ ఆఫ్ చాంపియన్స్ ఈవెంట్‌పైనే. జాన్ సీనా తన WWE టైటిల్‌ను కాపాడుకోగలడా? లేక ఆర్-ట్రూత్ షాక్ ఇస్తాడా? అన్నదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *