సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్
CPS: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teachers MLC)గా మల్క కొమరయ్య గెలుపునకు కృషిచేసిన సీపీఎస్ ఉద్యోగులందరికీ సీపీఎస్(CPSEA) ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మoడ్ల భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. గుండ్లపల్లెలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్ -ఆదిలాబాద్ -నిజామాబాద్ -మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని సీపీఎష్ ఉద్యోగులంతా ఏకతాటిపై ఉండి గెలుపులో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయాన్ని కైవసం చేసుకుని చరిత్రలో నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. మల్క కొమురయ్య గెలుపుతో సీపీఎస్ ఉద్యోగులంతా ఆనందంలో మునిగారని అన్నారు. గెలుపులో పాలుపంచుకున్న సీపీఎస్ ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులందరికీ టీసీపీఎస్ఈఏ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.
– శెనార్తి మీడియా, గన్నేరువరం