TEACHER SHAR
ప్రధానోపాధ్యాయురాలు శారదని సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

WOMENS DAY : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

WOMENS DAY : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (INTERNATIONAL WOMEN’S DAY) పురస్కరించుకొని జిల్లాలోని జైపూర్ మండలం వేలాల ఎంపీ యుపిఎస్ (MPUPS) పాఠశాలలో మహిళ దినోత్సవ వేడుకలను శుక్ర వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.

TEACHER
ఆటల పోటీలలో పాల్గొన్న ఉపాధ్యాయురాళ్లు

అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలలో వేలాల ఎంపీయుపిఎస్ (MPUPS) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (HM) శారద, ప్రసాద్, ఉపాధ్యాయురాళ్లు సువర్ణ, వనిత, స్వప్న, లక్ష్మిప్రసన్న, సాహిత్య, గోదాదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *