jhoncena
jhoncena

Jhoncena: జాన్ సీనాను ఓడించేందుకు ఆ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారా?

జాన్ సీనా టైటిల్‌కు ముప్పు!

Jhoncena: WWE వేదికగా ఉత్కంఠకు తావిచ్చే పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా అంటే అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అండిస్ప్యూటెడ్ WWE చాంపియన్‌గా ఉన్న జాన్ సీనాకు టైటిల్‌ కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఓ విస్మయ పరిణామంగా రోమన్ రెజిన్స్ తిరిగి వచ్చి సీనాను ఓడించేందుకు యత్నించవచ్చని అంచనా.

రెండేళ్లకు పైగా అంటే 1,316 రోజులు వరుసగా ఈ టైటిల్‌ను రోమన్ రెజిన్స్ దక్కించుకుని సత్తా చాటాడు. కానీ రెజిల్ మేనియా – 40లో కోడి రోడ్స్ చేతిలో ఓడి ఆ టైటిల్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత కోడి రోడ్స్‌ను ఓడించి ఆ టైటిల్ ను సీనా గెలుచుకున్నాడు. ప్రస్తుతం కోడి రోడ్స్ కింగ్ ఆఫ్ ది రింగ్ టోర్నమెంట్‌లో పోటీ పడుతున్నాడు. మళ్లీ టైటిల్‌ను దక్కించుకోవాలనే ఉద్దేశంతో రింగ్‌లో దిగుతున్నాడు.

ఇక రోమన్ రెజిన్స్ మాత్రం రెజిల్ మేనియా 41 తర్వాత నుంచి WWEలో కనిపించలేదు. కానీ ఆయన తిరిగి రింగ్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని విశ్లేషకుడు సామ్ రాబర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. రాబర్ట్స్ అంచనా ప్రకారం రోమన్ తిరిగి వచ్చి జాన్ సీనాను ఓడించి టైటిల్‌ను తిరిగి తన చేతుల్లోకి తెచ్చుకోవాలనుకుంటారట.

ఇదే సమయంలో జే ఉసో… కింగ్ ఆఫ్ ది రింగ్ పోటీలో కోడి రోడ్స్‌ను ఓడించవచ్చన్న ఊహాగానాలున్నాయి. అలా అయితే కోడికి ఓ క్లిష్ట పరిస్థితి తలెత్తుతుంది.

సామ్ రాబర్ట్స్ ఏమంటున్నారు?
“కోడి రోడ్స్ రోమన్ రెజిన్స్‌కు మద్దతుగా నిలిచే అవకాశముంది. అలా అయితే… సీనాను ఓడించేందుకు రోమన్‌కు సహాయపడతాడు. ఆపై కోడి – రోమన్ మధ్య ఓ టైటిల్ పోరు జరుగుతుంది,” అని రాబర్ట్స్ అభిప్రాయపడ్డారు.

WWEలో ఏమైనా జరగొచ్చు?
రోమన్ రెజిన్స్ తిరిగి వచ్చి జాన్ సీనాతో తలపడితే… అది WWE చరిత్రలో మరో కీలక ఘట్టంగా మారే అవకాశం ఉంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సీనా టైటిల్‌ను కాపాడుతాడా? లేదా… రోమన్ తిరిగి తన రాజ్యాన్ని పునరుద్ధరిస్తాడా? కోడి రోడ్స్‌కు ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలో రాబోతోంది. WWE అభిమానులు ఉత్కంఠగా సీట్లలో కూర్చొనే సమయం ఆసన్నమైందనే చెప్పాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *