Sports
Sports

Sports: రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు బిర్లా విద్యార్థి ఎంపిక

Sports: జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చిన బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి ఆకుల యశ్విక్‌ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భబిత విశ్వనాథన్, వ్యాయామ విద్యా విభాగాధిపతి సుంకరి మురళీధర్ గురువారం తెలిపారు.

14 సంవత్సరాల వయస్సు విభాగంలో యశ్విక్‌ జిల్లాలో అద్భుత ప్రదర్శన చూపాడని, తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

యశ్విక్‌ మరింతగా రాణించి  రాష్ట్ర స్థాయి,  జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు. అనంతరం యశ్విక్‌తో పాటు పాఠశాల ఫుట్ బాల్ కోచ్ సాయికిరణ్‌ను ఛైర్మెన్ దాసరి ప్రశాంత్ రెడ్డి, ఉపాధ్యాయుల బృందం అభినందించారు

-శెనార్తి మీడియా, కరీంనగర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *