పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
పరామర్శిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

CONDOLENCE : సురేష్ మరణం తీరని లోటు…

  • కేంద్ర మంత్రి సంజయ్ కుమార్

CONDOLENCE : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి నగర్ చెందిన మెరుగు సురేష్ కుమార్ శనివారం ఆకస్మికంగా మృతి చెందడం తీరని లోటని ఆయన మిత్రుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆది వారం సురేష్ కుమార్ కుటుంబ సభ్యులను సోదరుడు సంపత్ కుమార్, మిత్ర బృందంతో కలిసి మంత్రి పరామర్శించి మనోధైర్యం నింపారు. సురేష్ కుమార్ భార్య సువర్ణ, తల్లి నర్సమ్మ, పిల్లలతో మాట్లాడుతూ బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు.

సురేష్ కుమార్ ప్రజ్ఞ పాఠవాలను, ఆయన పర్యావరణ మిత్రగా ఏకశీల హ్యాండ్ మేడ్ పేపర్స్ పరిశ్రమ ద్వారా పొందిన ఉత్తమ అవార్డుల గురించి మాట్లాడుకున్నారు. చదువులో సైతం ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ సాధించాడని, హ్యాండ్ బాల్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్లేయర్ అవార్డు పొందారని గుర్తు చేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. సురేష్ పిల్లల చదువుల కోసం బాల్య మిత్రునిగా తప్పని సరిగా తన వంతు కృషి చేస్తానని వారిలో మనోధైర్యం నింపారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మెరుగు సుభాష్, భూమయ్య, డాక్టర్ శిరీష, డాక్టర్ శ్రీధర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొన్నారు.

– శెనార్తీ మీడియా, కరీంనగర్ : 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *