UNANIMOUS ELECTION : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో పెరిక కుల సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆది వారం పెరిక కుల సంఘం జిల్లా ముఖ్య నాయకులతో రాష్ట్ర నాయకులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా గౌరవ అధ్యక్షులుగా పెట్టెం లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులుగా బొడ్డు శంకర్, ప్రధాన కార్యదర్శిగా చుంచు రాజ్ కిరణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పెరిక కుల సంఘం అధ్యక్షుడు గటిక విజయ్, గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్, కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్, పెరిక విద్యార్థి వసతి గ్రుహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, ఆత్మ గౌరవ భవన నిర్మాణ వైస్ చైర్మన్ చుంచు ఊషన్న, జిల్లాలోని పెరిక కులస్తులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల (లక్షెట్టిపేట) :
