CP GOUSE
కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం

P.S. OPENING : ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలు

  • టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభం
  • కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం

P.S. OPENING : పోలీస్ అధికారులకు మెరుగైన పని వాతావరణం కల్పించడం ద్వారా ప్రజలకు మరింత సమర్థంగా, త్వరితగతిన సేవలందించగలమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (POLICE COMMISSIONER) గౌష్ ఆలం (GOUSE ALAM) పేర్కొన్నారు. ఆధునీకరించిన కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ (TWO TOWN POLICE STATION) నూతన భవనాన్ని మంగళవారం ప్రారంభించి భవనంలో ఏర్పాటు చేసిన విభాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ సదుపాయాలు దోహదపడతాయని తెలిపారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక బారక్, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.

CP GOUSE ALAM
మాట్లాడుతున్న కరీంనగర్ కమిషనర్ గౌష్ ఆలం

 

ఇది వరకు ఈ భవనం పైఅంతస్తులో ఉన్న సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్‌ను రూరల్ ఏసీపీ (ACP) కార్యాలయ ఆవరణలోకి మార్చడంతో మొత్తం భవనాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్ అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ADDTIONAL DCP) లు వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ సృజన్ రెడ్డి సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్ :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *