CM CUP : మంచిర్యాల జిల్లాలో తెలంగాణ – 2025 సి.ఎం. కప్ (2వ ఎడిషన్) కోసం గ్రామ స్థాయిలో క్రీడాకారుల ఎంపికల నమోదు ప్రక్రియ మొదలు పెట్టినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి హనుమంత రెడ్డి వెల్లడించారు. సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని విభాగాల క్రీడాకారుల నుంచి గ్రామస్థాయిలో ఎంపిక కోసం తప్పని సరిగా ఆన్ లైన్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తక్షణమే తమ వివరాలను అధికారిక వెబ్ సైట్ (https://satg.telangana.gov.in/cmcup/)లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99635 39234 లో సంప్రదించవచ్చన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
