BJP celebrations in Keshavapatnam: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో శంకరపట్నం మండలంలో పార్టీ శ్రేణులు ఉత్సాహభరితంగా సంబరాలు నిర్వహించాయి. మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ చేపట్టి బాణాసంచా కాల్చి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్రబిందువైనట్లే బీజేపీ జైత్రయాత్రకూ ఇదే ఆరంభ క్షేత్రంగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శక్తి మరింత విస్తరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఎన్ని రాజకీయాలు చేసినా చివరికి ధర్మమే గెలిచిందని వ్యాఖ్యానించారు. సాధారణ కార్యకర్తను ప్రధానమంత్రి స్థాయి నుంచి మేయర్ పదవివరకు చేర్చిన పార్టీ బీజేపీయేనని వెల్లడించారు.
కార్యక్రమంలో సర్పంచులు మల్లేష్, కొయ్యడ అశోక్, రజిత, ఉపసర్పంచులు జంగ జైపాల్, గుర్రం శ్రీనివాస్, రేణుక, నాయకులు దాసరపు నరేందర్, జగ్గారెడ్డి, జానపట్ల రాజిరెడ్డి, ఎలుకపెల్లి సంపత్, కనకం సాగర్, బొడిగె నరేష్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, గొల్లిపల్లి వెంకటేష్, రాజు బోడ తిరుపతిరెడ్డి, బొజ్జ సాయి ప్రకాష్, శ్రీనాథ్, తోట అరవింద్, మెడిశెట్టి రాజేష్, పవన్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, బొజ్జ కుమార్, రవి, వెంకన్న, శ్రీకాంత్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, శంకరపట్నం:
