ACP Venkateswarlu: విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తమ లక్ష్యాలను సాధించాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. మంచిర్యాల జిల్లా భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్ధమైన చదువు, సమయపాలన, ఆత్మవిశ్వాసం ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. పరీక్షల ముందు ప్రశాంతంగా ఉండి ఆత్మవిశ్వాసంతో చదవాలని, రోజువారీ చదువుకు సమయపట్టిక రూపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం ఏసీపీ వెంకటేశ్వర్లు, భీమారం ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పది మంది విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు, ఇతర విద్యా సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పాఠశాల సిబ్బంది తెలిపారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల( భీమారం):
