DR PUJARI
రూ. 5 లక్షల విరాళం అందజేస్తున్న డాక్టర్ పుజారి రమణ

DONATION : పెరిక సంఘ భవనానికి రూ. 5 లక్షల విరాళం అందజేత

 

DONATION : హైదరాబాద్ (HYD) లోని కోకాపేట (KOKAPETA) లో పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించే పెరిక కుల భవనానికి మంచిర్యాల జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు పూజారి రమణ (P. RAMANA) తన వంతు సహాయ సహకారాలు అందించారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ (SRR) ఫంక్షన్ హాలులో నిర్వహించిన పెరిక కుల సంఘ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో తెలంగాణ పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గటిక విజయ్ కుమార్ (G. VIJAY KUMAR) కు రూ. 5 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో పెరిక కుల సంఘం గౌరవ అధ్యక్షులు మద్దా లింగయ్య (LINGAIAH), రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్ (ANANDH), ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ (MANOHAR), కార్యనిర్వాహక కార్యదర్శి కీత విజయ్ కుమార్ (VIJAY KUMAR), పెరిక విద్యార్థి వసతి గృహం అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు (VENKATESWARLU), ఆత్మ గౌరవ భవన నిర్మాణ వైస్ చైర్మన్ చుంచు ఊషన్న (USHANNA), జిల్లాలోని పెరిక కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల (లక్షెట్టిపేట) :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *