BODDU SHANKAR
సేంద్రియ పద్దతిలో సాగుపై మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నిర్వాహకులు శంకర్

ORGANIC FARMING : ఆరోగ్యకరమైన జీవితానికి సేంద్రియమే మేలు

 

  • ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నిర్వాహకులు బొడ్డు శంకర్

ORGANIC FARMING : సేంద్రియ పద్దతుల్లో పండించిన పంటలతో అందరు ఆరోగ్యంగా ఉంటారని ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నిర్వాహకులు బొడ్డు శంకర్ (BODDU SHANKAR) అన్నారు. క్షేత్ర సందర్శనలో భాగంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడిలోని ఆదిత్య ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సోమ వారం సందర్శించిన మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ఆదర్శ పాఠశాల (MODEL SCHOOL) విద్యార్థులకు సేంద్రియ పద్దతిలో సాగు విధానంపై ఆయన అవగాహన కల్పించారు.

ORGANIC
సేంద్రియ పద్దతిలో సాగవుతున్న తైవాన్ జామ తోటను సందర్శించి పరిశీలిస్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులు

 

విద్యార్థులు, వారి తల్లిదండ్రులందరు భవిష్యత్తులో సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, సేంద్రియ వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలను, సేంద్రియ పద్దతుల్లో సాగుచేసే వ్యవసాయ విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న (MUTYAM BUCHANNA), కర్ణమామిడి సర్పంచి బొడ్డు భూమన్న (BODDU BHOMANNA), ఉప సర్పంచ్ గడ్డం వెంకటేష్ (GADDAM VENKATESH), వార్డ్ సభ్యులు కలమడుగు రవి (RAVI), మాజీ జడ్పీటీసీ పూస్కూరు శిల్ప శ్రీనివాస్ రావు (SHILPA SRINIVAS RAO), బొడ్డు శ్రీనివాస్ (SRINIVAS), రైతులు, మోడల్ స్కూల్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *