soap add girl
soap add girl

Viral Photo: ఈ సోప్ యాడ్ పాప.. ఇప్పుడు బీ టౌన్ టాప్ హీరోయిన్

Viral Photo : బాల నటులుగా తెరమీద కనిపించిన చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న అడ్వర్టైజ్ మెంట్లలో కనిపించిన వారిలో చాలా మంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సోప్ యాడ్ లో నటించి పాపులర్ అయిన అమ్మాయిల్లో ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా ఒకరు. అప్పట్లో టీవీలో “బంటి నీ సబ్బు స్లోనా ఏంటి” అనే సోప్ యాడ్ బాగా పాపులర్ అయ్యింది. ఆ యాడ్ లో తన ముద్దు ముద్దు మాటలతో అలరించిన ఈ చిన్నారి ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో కూడా తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బంటి ఈ సబ్బు స్లోనా ఏంటి అనే యాడ్ తెలుగు నాట బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ కు సంబంధించిన యాడ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.

అప్పట్లో ఈ యాడ్ లో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తున్నది. బాలీవుడ్ లో ఈమె ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా తన అందచందాలతో అందరిని ఆకట్టుకుంటున్నది. బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది ప్రస్తుతం హీరోయిన్ గా వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నది..

ఈ అమ్మాయి పేరు అవనీత్ కౌర్. ఈ చిన్నది డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్ ప్రోగ్రాం తో తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బాలనటిగా పలు టీవీ సీరియళ్లు, షోలతో పాటు పలు అడ్వర్టైజ్ మెంట్లలో నటించింది. మ్యాగీ, లైఫ్ బాయ్, హిందుస్థాన్ లివర్ ఇలా దాదాపు 40 కి పైగా టాప్ బ్రాండ్స్ ప్రొడక్టకులకు సంబంధించిన యాడ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2014లో మర్దానీ సినిమాతో వెండితెర మీద అడుగు పెట్టింది.

Avneet Kaur in Bikini
Avneet Kaur in Bikini

పలు చిత్రాల్లో నటించినా అనుకున్న స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. గత ఏడాది విడుదలైన టిక్కు వెడ్స్ షేరు, లవ్ కి అరేంజ్డ్ మ్యారేజ్ అనే సినిమాలతో క్రేజీ బ్యూటీగా బీ టౌన్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. త్వరలోనే లవ్ ఇన్ వియత్నాం అనే సినిమాతో ఈ చిన్నది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. పెర్ఫామెన్స్ పరంగా అవనీత్‌కు చంద్రనందిని అనే సీరియల్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సీరియల్‌లో విలన్ రోల్ లో నటించి తనలోని నటిని ప్రేక్షకులకు చూపించింది.

రోజు రోజుకకూ ఈమెకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఇక ఈ చిన్నది కూడా సోషల్ మీడియాలో నిత్యం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతులు పొగోడుతున్నది. ప్రస్తుతం అవనీత్ కౌర్ కు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.

avneet kaur
avneet kaur

 

https://www.instagram.com/p/DDmRwWkyB-X/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *