VOTERS
కోటపల్లి మండలం రాంపూర్ లో ఓటు వేసేందుకు నిలబడ్డ ఓటర్లు

G.P. POLLING : కొనసాగుతున్న మూడవ విడత పోలింగ్

  • 11 గంటల వరకు 62.38 శాతం…

G.P. POLLING : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలోని భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో బుధ వారం జరుగుతున్న మూడవ విడుత పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఐదు మండలాల్లో 1,06,889 మంది ఓటర్లుండగా చలి తీవ్రత కారణంగా ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల వరకు కేవలం 29,017 (27.15%) ఓట్లు పోలవగా 11 గంటల వరకు 66,676 (62.38%) ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 11 గంటల వరకు 62.38 శాతం…

మంచిర్యాల జిల్లాలో మూడవ విడత సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు భీమారం మండలంలో 8,141 (62.18%) మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నూర్ మండలంలో 16,425 (62.93%) మంది, జైపూర్ లో 16,812 (54.89%), కోటపల్లిలో 17,561(67.70%), మందమర్రి మండలంలో 7,737 (69.53%) మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో ఇప్పటి వరకు 66,676(62.38%) ఓట్లు పోలయ్యాయి.

  • మధ్యాహ్నం 1 గంటకు 84.51 శాతం పోలింగ్ నమోదు

మూడవ విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లావ్యాప్తంగా 84.51 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

భీమారం మండలంలో మొత్తం 13,093 ఓటర్లకు గాను 11,547 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 88.19 శాతం పోలింగ్ నమోదైంది. చెన్నూర్ మండలంలో 26,102 మంది ఓటర్లలో 22,967 మంది ఓటు వేసి 87.99 శాతం పోలింగ్ నమోదైంది.

జైపూర్ మండలంలో మొత్తం 30,626 ఓటర్లకు గాను 24,697 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 80.64 శాతం పోలింగ్ జరిగింది. కోటపల్లి మండలంలో 25,941 ఓటర్లలో 22,303 మంది ఓటు వేసి 85.98 శాతం పోలింగ్ నమోదు చేశారు.

మందమర్రి మండలంలో 11,127 ఓటర్లకు గాను 8,817 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 79.24 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 1,06,889 ఓటర్లకు గాను మధ్యాహ్నం 1 గంట వరకు 90,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. ఓటర్లు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని స్పష్టం చేశారు.

– శెనార్తి మీడియా, చెన్నూర్ / మంచిర్యాల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *