MARRIAGE BHARAT : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో ఓ పెళ్ళి భరత్ లో గురు వారం రాత్రి అపశృతి చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పెండ్లి అనంతరం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్న వాహనం ముందు భరత్ నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఒక్క సారిగా వాహనాన్ని స్టార్ట్ చేసి ఒక్క సారిగా ముందుకు కదిలించడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో 15 మంది వరకు కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. డ్రైవర్ నిద్రమత్తులో ఇలా చేశాడా? లేక మద్యం మత్తులో వాహనాన్ని ముందుకు నడిపించారా? అనేది తేలాల్సి ఉంది. ఏదీ ఏమైనా ఉత్సాహంగా జరుగుతున్న భరత్ కార్యక్రమం పెళ్లి జంట ఉన్న వాహన రూపంలో విషాదం నెలకొంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
– శెనార్తి మీడియా, శంకరపట్నం :