CORRUPTED PSR
CORRUPTED PSR : మాట్లాడతున్న దివాకర్ రావు

CORRUPTED PSR :అభివృద్ధిని అడ్డుకుంటున్న పీఎస్సార్

  • మంచిర్యాల-అంతర్గాం పూర్తయితే కరీంనగర్ కు 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది..
  • నాకు క్రెడిట్ దక్కుతుందనే ద్వేషంతోనే అడ్డుపుల్ల
  • వ్యక్తిగత స్వార్థానికి ప్రజలను బలి చేస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే
  • ఇసుక అక్రమ తవ్వకాలతో అవినీతికి తెరలేపిన కొక్కిరాల
  • ప్రేమ్ సాగర్ రావుపై నడిపెల్లి దివాకర్ రావు ఫైర్

CORRUPTED PSR : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తన స్వార్థం కోసం అభివృద్ధి పనులను అడ్డుకుంటూ ప్రజలను బలి చేస్తున్నారని మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రేమ్ సాగర్ చేస్తున్న అక్రమాలు, అభివృద్ధి పనుల విషయంలో ఆయన వైఖరిపై మండిపడ్డారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మంచిర్యాల నియోజకవర్గానికి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా మంజూరు చేయించిన మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి ప్రజల ప్రయోజనాలకు ఎంతొ ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మంచిర్యాల నుంచి కరీంనగర్‌కు ప్రయాణం 18 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉండేదన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తన ద్వేషపూరిత ధోరణితో ఈ ప్రాజెక్టును నిలిపివేసి, ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగితే తనకు మంచి పేరు వస్తుందని ప్రేమ్ సాగర్ భావించి, దాన్ని అడ్డుకోవడమే కాకుండా బ్రిడ్జి ప్రాజెక్టును పూర్తిగా పక్కదారి పట్టించారని విమర్శించారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా, అభివృద్ధిని తన వ్యక్తిగత స్వార్థాలకు బలి చేశారని ఆరోపించారు.

మహాప్రస్థానం నిర్మాణంలో జరిగిన అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు ఖర్చును 11 కోట్ల రూపాయలకు పెంచి, ఆడంబరాలకు ఆస్కారమిచ్చారని విమర్శించారు. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని మండిపడ్డారు. మహాప్రస్థానం నిర్మాణానికి కేటాయించిన భూమి కూడా 2014లో తానే అక్రమార్కుల నుంచి కాపాడి ప్రభుత్వానికి అప్పగించానని దివాకర్ రావు గుర్తు చేశారు.

మరోవైపు, మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో తనకు చెందిన నిధులను మారుస్తూ, ప్రజల నమ్మకాన్ని వంచిస్తున్నారని ప్రేమ్ సాగర్‌ రావుపై ఆరోపణలు గుప్పించారు. తాను చేపట్టిన పాత పనులకు కొత్త పేర్లు పెట్టి, వాటికి శంకుస్థాపన చేస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు.

అక్రమ మట్టి తవ్వకాల విషయంలో కూడా ప్రేమ్ సాగర్ పేరు తారుమారు అవుతున్నదని దివాకర్ తెలిపారు. చెరువుల నుండి అనుమతికి మించిన మట్టిని తవ్వించి, దాన్ని అక్రమ రవాణా చేయించారని, అధికారులు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములైపోయారని ఆరోపించారు.

మహాప్రస్థానంలో స్మశాన వాటిక నిర్మించడం వల్ల చుట్టుపక్కల భూములు నిరుపయోగమవుతున్నాయని, ఇది ప్రజలకు చాలా ఇబ్బందిగా మారుతోందని అన్నారు. శ్మశాన వాటిక నిర్మాణంలోనూ తగిన ప్రణాళికలేనిదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తాను గతంలో చేపట్టిన మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి వంటి ప్రాజెక్టులను తిరిగి అమలు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *