Police Humanity
Police Humanity: వృద్ధురాలిని పోలింగ్ కేంద్రంలోకి మోసుకెళ్తున్న కానిస్టేబుల్

Police Humanity: వృద్ధురాలి తపన.. కానిస్టేబుల్ మానవత్వం

  • పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యా స్ఫూర్తిని చాటిన వృద్ధురాలు..
  • నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలికి సాయం అందించిన కానిస్టేబుల్

Police Humanity: ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపనకు నడవలేని శారీరక పరిస్థితి కూడా అడ్డుకాలేకపోయిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో చోటు చేసుకుంది. నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు కుటుంబ సభ్యుల సాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధురాలి పరిస్థితిని గమనించిన విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ మానవత్వంతో స్పందించారు. ఆమెను తన చేతులతో ఎత్తుకుని పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లారు. అనంతరం వృద్ధురాలు ఓటు వేసేలా పూర్తిస్థాయిలో సహకారం అందించారు.

Police Humanity
Police Humanity

ఈ ఘటనలో వృద్ధురాలి స్ఫూర్తి, పోలీసు కానిస్టేబుల్ చూపిన సేవాభావం పలువురిని ఆకట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలనే వృద్ధురాలి తపనను, ఆమెకు అండగా నిలిచిన పోలీసు చొరవను గ్రామస్తులు హర్షాతిరేకాలతో అభినందించారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల(కోటపల్లి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *