Robo Dogs
Robo Dogs

Robo Dogs: భారత సైన్యంలోకి రోబో డాగ్స్.. ఏమిటీ వాటి ప్రత్యేకత!

Robo Dogs: ఆర్మీ డే పరేడ్‌లో భారత సైన్యం రోబోటిక్ కుక్కల(రోబో డాగ్స్)ను కూడా చేర్చింది. 2025 జనవరి 15న పూణేలో జరిగిన కార్యక్రమంలో భారత సైన్యం ఈ రోబోలను ప్రదర్శించింది. ఈ రోబోలను పరేడ్‌లో చేర్చడం ఇదే తొలిసారి. చతుర్భుజి మానవ రహిత గ్రౌండ్ వెహికల్స్ ఈ కవాతులో పాల్గొనడం ద్వారా సైన్యం తమ ఆధునీకతను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియోను కూడా బహిర్గతం చేశారు. రోబోలను భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నారు. యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి సహాయం అందించేందుకు వీటిని ఉపయోగిస్తారు.

సైన్యానికి సహాయకారిగా..
ఆర్మీ డే పరేడ్‌లో చేర్చిన ఈ రోబోట్లు సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో సైన్యానికి సహాయం అందించేలా రూపకల్పన చేశారు. వీటిని సైన్యంలో చేర్చడం వల్ల సైనికులకు ప్రమాదం తగ్గుతుంది. ఈ ARCV MULEలను ఆర్క్ వెంచర్స్‌లో భాగమైన న్యూఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ అభివృద్ధి చేసింది.

ఏ ప్రదేశంలోనైనా భద్రత, వస్తువుల భద్రత, ప్రమాదకరమైన వస్తువులను నిర్వహించడం, బాంబుల నిర్వీర్యం, సమాచారాన్ని సేకరించేందుకు వీటిని ఉపయోగించవచ్చు. ఈ రోబోట్‌లను మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్‌మెంట్( MULE) అని కూడా పిలుస్తారు. వాటిని రిమోట్‌గా నియంత్రించవచ్చు లేదా స్వయంప్రతిపత్తితో కూడా పని చేయవచ్చు.

వాటి ప్రత్యేకత ఏమిటి?
ఇందులో కంప్యూటర్, బ్యాటరీ, ముందు, వెనుక సెన్సార్లు, కదలిక కోసం కాళ్లు ఉన్నాయి. భారత సైన్యానికి గతేడాది జూన్‌లో ఇలాంటి 100 రోబోలు వచ్చాయి. సైనికుల సామర్థ్యాలను పెంచేందుకు వీటిని ఉపయోగించనున్నారు. అవి మెట్లు ఎక్కుతాయి, దిగుతాయి. పాడైన రోడ్లపైనా కూడా సులభంగా కదులుతాయి.

-40 డిగ్రీల సెల్సియస్ నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇవి IP67 రేటింగ్‌తో వస్తాయి. అంటే అవి వాటర్ రెసిస్టెంట్, కానీ వాటర్ ప్రూఫ్ కాదు. వాటి బరువు 51 కిలోలు. ఇవి సెకనుకు 3 మీటర్ల గరిష్ట వేగంతో పరుగెత్తగలవు. వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటల పాటు పని చేస్తాయి. గరిష్టంగా 12 కిలోల బరువును ఎత్తగలవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *