- ఆది శ్రీనివాస్‌కు మారుపాక గ్రామస్తుల కృతజ్ఞతలు
Peddammathalli:మారుపాకలోని పెద్దమ్మ తల్లి గుడి పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా రూ.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసి చిరుసత్కారం చేశారు.
ఈ కార్యక్రమంలో మారుపాక మాజీ సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేష్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశం, ముదిరాజ్ కుల సంఘ అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షుడు ఆశయ్య, ట్రెజరర్ అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, మత్స్యకార సంఘం అధ్యక్షుడు శేఖర్ బాబు, ఉపాధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.
అలాగే కుల పెద్దలు మల్లయ్య, అశోక్, ముకుంద, తిరుపతి, స్వామి, రాజు, పోశయ్య, వెంకటేష్, శ్రీనివాస్, దేవయ్య, నాంపల్లి, శంకరయ్యతో పాటు యువకులు అశోక్, వినయ్, ప్రేమ్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, వేములవాడ