పరిశీలిస్తున్న అధికారుల బృందం
పరిశీలిస్తున్న అధికారుల బృందం

WELLNESS CENTER : హెల్త్ వెల్‌నెస్ సెంటర్ సేవలపై పరిశీలన

 

WELLNESS CENTER : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, డిఐఓ సాజిదా, పిఓఎంసిహెచ్ డాక్టర్ సన జవేరియా కలిసి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్ నెస్ సెంటర్‌ను (HEALTH WELLNESS CENTER) సందర్శించారు. ఈ సందర్భంగా సెంటర్‌లో ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం ద్వారా అందుతున్న సేవలతో పాటు, పెన్షనర్లు, జర్నలిస్టులకు కల్పిస్తున్న అవుట్ పేషెంట్ సేవలు, ల్యాబ్ పరీక్షల వివరాలు, మందుల పంపిణీకి సంబంధించిన ఫార్మసీ రికార్డులను పరిశీలించారు. అక్కడికి వచ్చిన పెన్షనర్లు, ఉద్యోగులు, జర్నలిస్టులతో మాట్లాడి హెల్త్ వెల్నెస్ సెంటర్‌లో అందుతున్న సేవలపై సమాచారం సేకరించారు. ప్రజలు ఈ సెంటర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

– శెనార్తి మీడియా, కరీంనగర్ :

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *