- ఆసుపత్రిలోనా..! వైన్ షాప్‌లోనా..!
- పట్టించుకోని అధికారులు
MANCHERIAL GGH : మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి( జీజీహెచ్,ఎంసీహెచ్ )లో సూపర్ వైజింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థమైంది. విధుల్లో ఉండాల్సిన సూపర్ వైజర్లు ఆసుపత్రి ప్రాంగణంలో కాకుండా వైన్ షాపుల వద్ద కనిపిస్తున్నారన్న ఆరోపణలు ఆసుపత్రిలో చర్చనీయాంశంగా మారాయి. పర్యవేక్షణ చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
కృష్ణ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన సూపర్ వైజర్ల పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, వారు ఆసుపత్రిలో పని చేస్తున్నారా! లేక టైం పాస్ కోసం వస్తున్నారా! అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంస్థ మేనేజర్ వేణు ఆసుపత్రి పనులపై ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లులు అవసరమైనప్పుడు మాత్రమే ఆసుపత్రి ముఖం చూసే పరిస్థితి నెలకొందని, మిగితా సమయంలో ఎవరు పని చేస్తున్నారు! వారి పని తీరుపై పట్టించుకునే వారు లేరని పలువురు ఆసుపత్రి సిబ్బంది వ్యాఖ్యానించడం కొసమెరుపు.
సూపర్ వైజర్లు అనిల్, సధన్ పేర్లు ఆసుపత్రిలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. విధుల్లో ఉండాల్సిన సమయంలో వైన్ షాపుల్లో దర్శనమిచ్చారన్న విమర్శలు ఉద్యోగుల్లో విస్తృత చర్చకు దారితీశాయి. సూపర్ వైజింగ్ బాధ్యతలను వదిలేసి ఇలా తిరిగితే ఆసుపత్రి నిర్వహణ ఎలా జరిగేది అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారాయి.
తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామా
మద్యం షాపులకు వెళ్లిన విషయం జర్నలిస్టులకు తెలిసిందని గుర్తించిన సూపర్ వైజర్లు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాకు తెర తీశారు. గత నెల వరకు మధ్యాహ్నం షిప్ట్ హాజరు కనిపించలేదు. కానీ డిసెంబర్ నుంచి హాజరు రిజిస్టర్ లో యాడ్ చేశారు. ఒక వేళ మద్యం దుకాణానికి తాము లీవ్ పెట్టి వెళ్లామని బుకాయించే ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో కొత్త డ్రామాకు తెరతీశారు. ఈ సూపర్ వైజర్ల లీలలు అధికారులకే తెలియాలి.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :

అక్టోబర్, నవంబర్ లో కనిపించని మధ్యాహ్నం షిప్ట్
