housing society
housing society : కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న బీఎస్పీ నాయకలు

Housing Society: హౌసింగ్ సొసైటీలో అవకతవకలపై  విచారణ జరిపించాలి 

  • హనుమంత రెడ్డి, గడియారం శ్రీహరిని తొలగించాలి
  • బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్

Housing Society: టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీలో అవకతవకలపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

హనుమంత రెడ్డిని విచారణ అధికారిగా కొనసాగించడం సరికాదని పేర్కొన్నారు. స్థానిక సంబంధాలు ఉన్న వారితో విచారణ చేపడితే నిజాలు బయటపడవని వ్యాఖ్యానించారు. హనుమంత రెడ్డి స్థానంలో ఇతర జిల్లా అధికారిని నియమించాలని సూచించారు.

ప్రస్తుతం టీఎన్జీఓ అధ్యక్షుడిగా ఉన్న గడియారం శ్రీహరిని వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కొనసాగితే విచారణ దిశా తప్పే అవకాశం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు.

సొసైటీలో జరిగిన అవకతవకలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పారదర్శక విచారణకు అనుకూల వాతావరణం ఏర్పాటుచేయాలని కోరారు.

ఈ సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగుల కిరణ్‌బాబు, పట్టణ నాయకులు కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *